KTR: మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన..! 27 d ago
TG : మహబూబాబాద్ జిల్లాలో సోమవారం కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. ధర్నాకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. లగచర్ల బాధితులకు అండగా.. గిరిజన రైతులతో తహశీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయనున్నారు. గిరిజన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం చేస్తామని బిఆర్ఎస్ నేతలు తెలిపారు.